నిరుద్యోగులకు గుడ్ న్యూస్: కేపీ కానిస్టేబుల్ పీఈటీ అడ్మిట్ కార్డులు విడుదల

రిపోర్టర్: వెంకట్ స్థలం: Kolkata

పశ్చిమ బెంగాల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కోల్కతా పోలీస్ కానిస్టేబుల్ మరియు లేడీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి పీఎంటీ, పీఈటీ పరీక్షల అడ్మిట్ కార్డులను విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల ఇరవయ్యెనిమిది నుంచి శారీరక దారుఢ్య పరీక్షలు ప్రారంభం కానున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.