అమెరికా రాజకీయాల్ లో కలకలం: ఒహియోపై డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తప్పుడు వ్యాఖ్యలు

రిపోర్టర్: అశోక్ స్థలం: Ohio

అమెరికాలో ఎన్నికల ప్రచార సభలో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒహియో రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని డెమొక్రాట్లు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే 1803లోనే ఒహియో అమెరికాలో 17వ రాష్ట్రంగా చేరిందన్న చారిత్రక సత్యాన్ని విస్మరించి ఆయన మాట్లాడటంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పొరపాటు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.