ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కీలక సమీక్ష
రిపోర్టర్: కిరణ్
స్థలం: పశ్చిమ గోదావరి
భవిష్యత్ అవసరాలకై సమగ్ర నీటి ప్రణాళిక రూపకల్పన, పక్కాగా ఇరిగేషన్ క్యాలెండర్ అమలు చేయడం మరియు విశాఖ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలపై ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కీలక ఇరిగేషన్ సమీక్ష సమావేశంలో పాల్గొన్నట్లు జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ సమావేశంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.