వైసీపీకి గట్టి షాక్: ఉప్పలూరులో టీడీపీలోకి యాభై కుటుంబాల భారీ చేరిక

రిపోర్టర్: Alfa News Desk స్థలం: శ్రీ అవధూత కాశినాయన

శ్రీ అవధూత కాశినాయన మండలం ఉప్పలూరు గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన యాభై కుటుంబాలు టీడీపీలో చేరాయి. బద్వేల్ నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కర్ణాటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఇన్చార్జి మంచూరు సూర్యనారాయణరెడ్డి సమక్షంలో కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామస్థాయిలో పార్టీ పటిష్టతకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.