సినీ ప్రియులకు గుడ్ న్యూస్: ఓటీటీలోకి ధనుంజయ వివాహ డాక్యుమెంటరీ చిత్రం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

ప్రముఖ నటుడు ధనుంజయ మరియు ఆయన సతీమణి ధన్యతా గౌరక్లార్ తమ వివాహ ప్రయాణంతో కూడిన డాక్యుమెంటరీ చిత్రాన్ని త్వరలోనే డిజిటల్ వేదికపై విడుదల చేయనున్నట్లు నటుడు ధనుంజయ వెల్లడించారు. తమ మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా రూపొందించిన ఈ చిత్రానికి ధన ధన్య కళ్యాణ అని పేరు పెట్టామని, అభిమానులను తమ కుటుంబ సభ్యులుగానే భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.