ఉత్తరప్రదేశ్ పిఈటీ 2026 ప్రాథమిక కీ విడుదల: అభ్యర్థులకు కీలక ప్రకటన

రిపోర్టర్: అశోక్ స్థలం: Uttar Pradesh

ఉత్తరప్రదేశ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన పిఈటీ 2026 పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ ఇరవై ఐదు, ముప్ పై మరియు నవంబర్ మొదటి తేదీలలో జరిగిన ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్ ను అంచనా వేసుకోవాలని సూచించారు. ఈ ప్రాథమిక కీ పై అభ్యంతరాలను నవంబర్ ఎనిమిదవ తేదీలోగా తెలపాలని కమిషన్ స్పష్టం చేసింది.