సింగరేణి పరిరక్షణ కోసం చలో రామగుండం: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: మంచిర్యాల
సింగరేణి సంస్థ పరిరక్షణ కొరకై ఈ నెల 14వ తేదీన రామగుండంలో సింగరేణి కార్మిక గర్జన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వెల్లడించారు. ఈ సభను విజయవంతం చేయాలని ఆయన కార్మికులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాలపై పోరాటం ఉధృతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కార్మికుల హక్కులను కాపాడుతామని స్పష్టం చేశారు.