కాంగ్రెస్ పాలనలో అక్రమ అరెస్టులే తప్ప సాధించిందేమి లేదు: కేటీఆర్

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. దమ్ముంటే ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేసి చూపించాలని, అమలు చేస్తే ఏ విచారణకైనా సిద్ధమంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్ విసిరారు.