మంత్రి పదవి పోయాక కొండా సురేఖకు భారీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం
రిపోర్టర్: వెంకట్
స్థలం: హనుమకొండ
తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఆమెకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం గన్మెన్లు, ఎస్కార్ట్ వాహనాలు మరియు నివాసం వద్ద ఉన్న పోలీసు బందోబస్తును కూడా ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకుంది. మంత్రి పదవి కోల్పోవడంతో పాటు భద్రత కూడా తగ్గిపోవడంతో వరంగల్ రాజకీయాల్లో ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.