ఆస్ట్రేలియా ఏ జట్టుతో సిరీస్‌కు దూరమైన పేసర్ విజయ్‌కుమార్ వైశాక్

రిపోర్టర్: రాము స్థలం: పుదుచ్చేరి

ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరగనున్న నాలుగు రోజుల మ్యాచ్‌ల సిరీస్‌కు కర్ణాటక పేసర్ విజయ్‌కుమార్ వైశాక్ గాయం కారణంగా దూరమయ్యాడు. తొడ కండరాల గాయం నుంచి కోలుకోకపోవడంతో అతడి స్థానంలో ఆంధ్ర ఆఫ్ స్పిన్నర్ త్రిపురాన విజయ్‌ను ఇండియా ఏ జట్టులోకి ఎంపిక చేశారు. దేవదత్ పడిక్కల్ నేతృత్వంలోని ఈ జట్టు పుదుచ్చేరి వేదికగా జరిగే మ్యాచ్‌లలో తలపడనుంది.