శబ్ద కాలుష్య నియంత్రణపై డీజే నిర్వాహకులకు పోలీసుల హెచ్చరిక
రిపోర్టర్: venkat
స్థలం: కుక్కునూరు
రాబోయే పండుగలు, మతపరమైన కార్యక్రమాలు మరియు విగ్రహ నిమజ్జనాల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్స్, లౌడ్స్పీకర్ల వినియోగంపై కుక్కునూరు పోలీసుల ఆధ్వర్యంలో డీజే నిర్వాహకులు, ఆపరేటర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు శబ్ద పరికరాల వినియోగంపై అమలులో ఉన్న నిబంధనలు, సైలెన్స్ జోన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజారెడ్డి స్పష్టం చేశారు.