అనంతపురంలో బర్డ్ ఫ్లూ కలకలం: రెడ్ జోన్గా సిద్ధరాంపురం గ్రామం ప్రకటన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని సిద్ధరాంపురం గ్రామంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. గత నెలలో రెండు వేలకు పైగా కోళ్లు మరణించడంతో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. భోపాల్ ప్రయోగశాల నివేదికలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో ఒక కిలోమీటర్ పరిధిని రెడ్ జోన్గా ప్రకటించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గ్రామంలో కోళ్లు, గుడ్లు, దాణా రవాణాను పూర్తిగా నిషేధించినట్లు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రేమ్చంద్ స్పష్టం చేశారు.