హైదరాబాద్‌లో అన్నదాన కేంద్రాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ రూపకల్పన
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
వినాయక నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్‌లో జరిగే అన్నదాన కార్యక్రమాల వివరాలను తెలుసుకోవడానికి 'Annadhanam Spots' పేరిట ప్రత్యేక వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. ఈ పోర్టల్ ద్వారా సమీపంలోని అన్నదాన కేంద్రాల లొకేషన్, సమయాలను ఉచితంగా తెలుసుకోవచ్చు. బ్యాచిలర్లు, ఉద్యోగులు, హాస్టల్ విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నిర్వాహకులు కూడా తమ వివరాలను ఇందులో నమోదు చేయవచ్చు.