విశాఖలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు భాగస్వామ్యం

రిపోర్టర్: సతీష్ స్థలం: Visakhapatnam

విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ పైలట్ సైట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సముద్ర వ్యర్థాలను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు మరియు స్కూబా డైవర్లతో ఆయన ముచ్చటించి వారి సేవలను అభినందించారు.