మహిళా వర్సిటీ విద్యార్థినుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి రాకపోకలు సాగించే విద్యార్థినులు, అధ్యాపకుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసుల ఫ్రీక్వెన్సీని పెంచుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ అదనపు బస్సులు సెప్టెంబర్ 27 నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. బస్సుల కొరతతో విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు, ఆర్టీసీ యాజమాన్యానికి వర్సిటీ వీసీ సూర్య ధనంజయ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.