ట్యాక్స్ ప్లానింగ్‌పై వెబినార్: గ్రేటర్ డెలావేర్ తెలుగు సంఘం కీలక ప్రకటన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: డెలావేర్
పన్ను భారాన్ని తగ్గించుకుంటూ సంపదను వృద్ధి చేసుకునే అంశంపై అడ్వాన్స్డ్ ట్యాక్స్ స్ట్రాటజీస్ పేరుతో ఒక ఉచిత ఎడ్యుకేషనల్ వెబినార్‌ను నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ డెలావేర్ తెలుగు సంఘం నిర్వాహకులు ప్రకటించారు. ఈ నెల ఇరవై ఐదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ఈ వర్చువల్ సమావేశం జరగనుందని తెలిపారు. వ్యాపారవేత్తలు, నిపుణులు, ఇన్వెస్టర్లు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.