కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు పోటెత్తిన వరద ప్రవాహం

రిపోర్టర్: రమేష్ స్థలం: అయిజ

కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గత మూడు నెలలుగా వర్షాలు లేక ఎండిపోయిన ఆయకట్టు భూములు, నీటి కోసం పడ్డ అష్టకష్టాల నుంచి అన్నదాతలకు విముక్తి లభించింది. గురువారం ఆర్డీఎస్ ఆనకట్టకు 12,233 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ప్రధాన కాల్వకు 650 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నదికి వరద పోటెత్తడంతో తుంగభద్ర తీర ప్రాంత రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.