టెలివిజన్లోకి అవికా గోర్ రీఎంట్రీ: అప్సర పాత్రలో అదరగొట్టేందుకు సిద్ధం

రిపోర్టర్: కృష్ణ స్థలం: Mumbai

ప్రముఖ నటి అవికా గోర్ కొత్త సూపర్ నేచురల్ టెలివిజన్ ధారావాహిక అప్సర ద్వారా మళ్లీ బుల్లితెరకు రీఎంట్రీ ఇస్తున్నట్లు నటి వెల్లడించారు. ముక్తా ధోండ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ అద్భుతమైన ధారావాహికలో ఆమె అప్సరసల రాణి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. సముద్ర మథనం స్ఫూర్తితో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టులో సమీక్షా జైస్వాల్, పరాస్ కల్రావత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.