మురసు తుఫాను వేళ విజయవాడలో విస్తృత సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు

రిపోర్టర్: రాము స్థలం: ఎన్టీఆర్

మురసు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ నగరంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రజల రక్షణే తమ ప్రథమ కర్తవ్యమని, ప్రజా సేవే తమ లక్ష్యమని విజయవాడ సిటి పోలీస్ వెల్లడించారు. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రాంతాలలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సమయాల్ లో ప్రజలు పోలీసుల సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.