మన ప్రాంత సంస్కృతిని ప్రపంచానికి చాటేలా ఒంగోలు ఉత్సవం

రిపోర్టర్: మహేష్ స్థలం: ప్రకాశం

మన ప్రాంతపు సంస్కృతి మరియు సాంప్రదాయాలను ప్రపంచానికి సగర్వంగా చాటిచెప్పే వేదికగా ఒంగోలు ఉత్సవం నిలుస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, విప్లవకారులు, కవులు, కళాకారులు మరియు మేధావుల పుట్టినిల్లుగా ఒంగోలు ప్రాంతానికి గొప్ప చారిత్రక ఘనత ఉందని ఆయన తెలిపారు. ఒంగోలు అనగానే అందరికీ ముందుగా రాజసం, పౌరుషానికి ప్రతీకగా నిలిచే ఒంగోలు జాతి గిత్తలే గుర్తుకువస్తాయని, క్రమంగా కనుమరుగవుతున్న ఆ గొప్ప సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఆయన ఆకాంక్షించారు.