పుత్తూరులో కుండపోత వర్షం వేసవి తాపం నుండి ప్రజలకు ఉపశమనం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పుత్తూరు

చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం కె.బి.ఆర్.పురంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత వారం రోజులుగా మండిపడిన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన గ్రామీణ ప్రజలకు ఆకస్మికంగా కురిసిన భారీ వర్షం ఊరటనిచ్చింది. చల్లటి గాలులు వీయడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వేడి నుండి ఉపశమనం లభించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.