పెనుమాకలో వినాయక నిమజ్జనం సందర్భంగా టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ
రిపోర్టర్: విజయ్
స్థలం: Penumaka
పెనుమాకలో వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. పోలీసుల సమక్షంలోనే ఒక వర్గంపై మరో వర్గం భౌతిక దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ పాట విషయంలో చెలరేగిన వివాదం కారణంగా ఒక వర్గం వారు కేవలం తమ వైపే వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఈ ఘర్షణ మరింత ముదిరినట్లు స్థానికులు చెబుతున్నారు.