తాలిపేరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద పదమూడు గేట్ల ఎత్తివేత

రిపోర్టర్: భాస్కర్ స్థలం: చర్ల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం 12 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో, అప్రమత్తమైన అధికారులు 13 గేట్లు ఎత్తి 17 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల రాత్రికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని, సిబ్బందిని అప్రమత్తం చేశామని ప్రాజెక్టు డీఈ తిరుపతి వెల్లడించారు.