హైదరాబాద్‌లో ఇకపై ఆరు కోచ్‌ల మెట్రో రైళ్లు పరగెత్తనున్నాయి
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న 3 కోచ్‌ల స్థానంలో 6 కోచ్‌ల మెట్రో రైళ్లను అందుబాటులోకి తేనున్నారు. తొలి దశలో 60 కోచ్‌లతో కూడిన 10 కొత్త రైళ్లను కొనుగోలు చేయనున్నారు. ఒక్కో రైలులో 2 వేల మంది ప్రయాణించవచ్చు. త్వరలో అంతర్జాతీయ టెండర్లు పిలవనున్నారు.