కాలువలు చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక
రిపోర్టర్: గోపి
స్థలం: గరివిడి
భారీ వర్షాలతో జలాశయాలు, చెరువులు, కాలువలు నీటితో నిండి పొర్లుతున్నందున చిన్నారులు, యువకులు అప్రమత్తంగా ఉండాలని గరివిడి అధికారులు హెచ్చరించారు. లోతు తెలియక నీటిలోకి దిగడం వల్ల గతంలో పలువురు ప్రాణాలు కోల్పోయారని, కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలు, చెరువుల వద్ద రక్షణ కంచెలు మరియు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, పిల్లలను తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలని స్థానిక సంస్థల అధికారులు కోరారు.