ముంబై కోస్టల్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

రిపోర్టర్: రాజేష్ స్థలం: Mumbai

ముంబైలోని కోస్టల్ రోడ్డుపై లోటస్ జెట్టీ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన బిఎండబ్ల్యూ కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మెరైన్ డ్రైవ్ నుంచి హాజీ అలీ వైపు వెళ్తున్న ఓవర్‌స్పీడ్ కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ముంబై నగరపాలక సంస్థ అధికారులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.