కొన్ని రాష్ట్రాల పురుషులకు ఉద్యోగాలు ఇవ్వబోమన్న బెంగళూరు సీఈఓ కార్తీక్

రిపోర్టర్: సతీష్ స్థలం: బెంగళూరు

బెంగళూరుకు చెందిన ఏవన్ స్పోర్ట్స్ వరల్డ్ ఫౌండర్ కార్తిక్ ఎస్జీ వివాదాస్పద ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులకు తమ కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వబోమని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. మాజీ ఉద్యోగి ప్రవర్తన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిబంధనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.