ఢిల్లీలో పీజీ వసతి గృహాలపై మున్సిపల్ కార్పొరేషన్ భద్రతా సర్వే షురూ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నగరంలోని పీజీ వసతి గృహాలలో భద్రతా సర్వేను ప్రారంభించారు. 12 జోన్లలోని 1,150 పీజీలను తనిఖీ చేయగా, సుమారు 20 వేల మంది నివసిస్తున్నట్లు గుర్తించారు. కొన్ని భవనాలకు మరమ్మతులు అవసరమని తేల్చగా, సెప్టెంబర్ 10 నాటికి సర్వే పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.