ఏపీఈఆర్సీ కొత్త ఛైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ బినోయ్ కుమార్ నియామకం

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ పరిశీలించిన పేర్లలో ఆయనను ఎంపిక చేశారు. కాగా అప్పటి ఛైర్మన్ పదవీ విరమణ తర్వాత ఈ పదవి ఇన్ఛార్జ్తోనే కొనసాగుతోంది.