వేగంతో ప్రాణాలకు ముప్పు: వాహనదారులను హెచ్చరించిన తెలంగాణ పోలీసు శాఖ

రిపోర్టర్: విజయ్ స్థలం: Telangana

అతివేగం కొద్ది క్షణాల ఉత్సాహాన్ని ఇస్తుందని, కానీ అది మీతో పాటు ఇతరుల ప్రాణాలను తీవ్ర ప్రమాదంలోకి నెడుతుందని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు ఎప్పుడూ అత్యంత అప్రమత్తంగా ఉంటూ సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రయాణాల్లో వేగాన్ని నియంత్రించుకొని రోడ్డు భద్రతా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.