పాఠశాలల్లో నైతిక విలువల బోధన తప్పనిసరి చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు

రిపోర్టర్: VG ReddyD SrJournalist స్థలం: వెంకటాచలం

దేశంలో సాంస్కృతిక విలువలను పరిరక్షించుకోవాలని, అందుకోసం పాఠశాలల్లో నైతిక విలువల తరగతులు తప్పనిసరి చేయాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కోరారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాల సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో విధానపరమైన విమర్శలు ఉండాలి కానీ వ్యక్తిగత దూషణలు తగవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.