పద్దెనిమిదేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని వెంకయ్యనాయుడు సూచన
రిపోర్టర్: VG ReddyD SrJournalist
స్థలం: వెంకటాచలం
సమాజంలో సోషల్ మీడియా దుర్వినియోగం కావడం పట్ల పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ దేశాల తరహాలో మన దేశంలోనూ పద్దెనిమిదేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ఆంక్షలు ఉండాలన్నారు. అలాగే బడి ప్రాంగణాల్లో విద్యార్థుల సెల్ఫోన్ వాడకాన్ని నిషేధించాలని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగిన స్వర్ణభారత్ ట్రస్ట్ వేడుకల్లో ఆయన ఈ మేరకు అభిప్రాయపడ్డారు.