కేజీబీవీలో మెనూ తప్పితే చర్యలు తప్పవంటూ కలెక్టర్ వార్నింగ్

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

జైపూర్ లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వంటశాలను పరిశీలించి విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఇంటర్మీడియట్ విద్యార్థినులకు గణిత బోధన జరుగుతున్న తీరును పరిశీలించి వారి అభ్యాసన సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు మంజూరైన పడకలను పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని ఆదేశించారు.