ప్రధాని మోదీ పాలనా దశాబ్దాల ఘనత: బీజేపీ నేతల ప్రత్యేక సమావేశం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నిజామాబాద్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రధాన అధిపతిగా ఇరవై ఐదు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన బీజేపీ కీలక సమావేశంలో ధర్మపురి అరవింద్ - ఎంపీ నిజామాబాద్ పాల్గొని అభినందనలు తెలిపారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు మాజీ ప్రజాప్రతినిధులు హాజరై మోదీ నాయకత్వ పటిమను, సుపరిపాలన విశేషాలను కొనియాడారు.