విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి.. సింగరేణి జీఎంకు వినతి

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీ 1, 14వ వార్డుల్లో నిలిచిపోయిన సింగరేణి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు మందమర్రి సింగరేణి జీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్, టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్ తదితరులు ఈ సమస్యను జీఎం దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన జీఎం రేపటి నుంచి విద్యుత్ సరఫరాను యథావిధిగా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబాసి వెంకటస్వామి, పరమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ ఇబ్బంది త్వరలోనే తొలగిపోనుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.