ఉరుగ్వేతో ఫ్రెండ్లీ మ్యాచ్: ఏకాగ్రత చాలా ముఖ్యం అంటున్న ఖాలిద్ జమీల్

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

ఉరుగ్వేతో తలపడేందుకు భారత్ జట్టు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని భారత ఫుట్బాల్ హెడ్ కోచ్ ఖాలిద్ జమీల్ స్పష్టం చేశారు. బ్రెజిల్ చేతిలో ఎదురైన పరాభవం నుంచి తగిన పాఠాలు నేర్చుకున్నామని ఆయన తెలిపారు. తదుపరి జరగబోయే ఉరుగ్వే ఫ్రెండ్లీ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన కనబరచాలంటే ఆటగాళ్లలో ఏకాగ్రత, తక్షణ రికవరీ ఎంతో కీలకమని వెల్లడించారు. శారీరకంగా, వ్యూహాత్మకంగా ఎంతో పటిష్టంగా ఉన్న ఉరుగ్వే జట్టును ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగుతున్నట్లు ఆయన వెల్లడించారు.