రాష్ట్రపతి ఏడీసీగా వివాహ నిబంధనపై మేజర్ రిషబ్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: విజయ్
స్థలం: India
రాష్ట్రపతికి ఏడీసీగా పనిచేసే సమయంలో పెళ్లి చేసుకోవడానికి నిబంధన అడ్డువచ్చిందని మాజీ మేజర్ రిషబ్ సింగ్ సాంబ్యాల్ వెల్లడించారు. సైన్యంలో అత్యున్నత బాధ్యతల కోసం వ్యక్తిగత జీవితాన్ని, సాధారణ స్వేచ్ఛను త్యాగం చేయాల్సి వచ్చిందని పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్మూతో గడిపిన మూడేళ్లు తన తల్లిని గుర్తుకు తెచ్చాయని భావోద్వేగంగా చెప్పారు.