రైతులకు సాగునీరు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ కు బుద్ధి చెబుదాం: హరీశ్ రావు
రిపోర్టర్: సునీల్
స్థలం: వనపర్తి
యాసంగిలో పంటలకు సాగునీరు, కరెంటు ఇవ్వలేమంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా అల్వాలలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల సంక్షేమం కంటే కమీషన్లపైనే ధ్యాస ఉందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరువు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకోవడం కాకుండా, రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.