విద్యార్థులకు గుడ్ న్యూస్: కృత్రిమ మేధ కోర్సును ప్రవేశపెట్టనున్న ఒడిశా సర్కార్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: భువనేశ్వర్
ఒడిశా రాష్ట్రంలోని అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్లో చదువుతున్న విద్యార్థుల కోసం సరికొత్త కృత్రిమ మేధ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్ కాళీ ప్రసన్న మహాపాత్ర వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గుడ్ సిటిజెన్షిప్ కోర్సు స్థానంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్ అనే వాల్యూ-యాడెడ్ కోర్సు అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. దీని ద్వారా విద్యార్థులకు ప్రాథమిక పరిజ్ఞానం అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.