రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2: ఫినాలే టికెట్ కైవసం చేసుకున్న షెహజాద్

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

ప్రముఖ రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్ సీజన్ టూ లో షెహజాద్ పూనావాలా సరికొత్త చరిత్ర సృష్టించారని, ఫినాలే టికెట్ ను మొదటి కంటెస్టెంట్ గా సొంతం చేసుకున్నారని షో నిర్వాహకులు తెలిపారు. కరణ్ పటేల్ తో జరిగిన హోరాహోరీ టాస్క్ లో విజయం సాధించి ఆయన ఈ ఘనత సాధించారు. ఈ పరిణామంతో షోలో ఉత్కంఠ మరింత పెరిగిందని, తదుపరి ఎపిసోడ్లపై ఆసక్తి నెలకొందని వారు వెల్లడించారు.