ఆటో కార్మికుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక రైడ్ యాప్
రిపోర్టర్: రమేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక రైడ్-హేలింగ్ మొబైల్ యాప్‌ను తీసుకురానున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రైవేట్ యాప్‌ల కమిషన్ల భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే ఈవీ ఆటోల కొనుగోలుకు రూ.1.5 లక్షల సబ్సిడీ ఇస్తామని, ఇందుకు రూ.200 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.