'గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం': చిగురుపాడులో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
రిపోర్టర్: విజయ్
స్థలం: నాయుడుపేట
నాయుడుపేట మండలం చిగురుపాడు గ్రామ పంచాయతీలో బాలజ్యోతి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ మరియు జనరల్ స్టోర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీఆర్డీఎస్ పరిధిలోని ఏడు గ్రామాలకు చెందిన సుమారు వందలాది మంది ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం అందుబాటులోకి రానుందని నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇటువంటి సేవలు కొనసాగుతాయని నాయకులు పేర్కొన్నారు.