ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఇళయరాజా పేరుతో ప్రత్యేక తపాలా బిళ్ల విడుదల
రిపోర్టర్: నరేష్
స్థలం: సిడ్నీ
భారతీయ సంగీత మాంత్రికుడు ఇళయరాజాకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఐదు దశాబ్దాల అద్భుత సంగీత ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియా పార్లమెంట్లో ప్రత్యేక తపాలా బిళ్లను ఘనంగా విడుదల చేశారు. విక్టోరియన్ ప్రభుత్వ ప్రతినిధులు, పార్లమెంట్ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో ఇళయరాజా భావోద్వేగానికి లోనయ్యారు. తమిళనాడులోని ఓ కుగ్రామం నుంచి ప్రారంభమైన తన సంగీత ప్రయాణం నేడు అంతర్జాతీయ స్థాయికి చేరడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ఆయన తెలిపారు.