సైఫాబాద్ పీఎస్ లో కేటీఆర్ పీఆర్వోపై దాడి దుర్మార్గం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

హైదరాబాద్‌ సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో తన పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్‌ రెడ్డిపై దుండగులు దాడి చేయడాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. పోలీసుల సమక్షంలోనే పక్కా ప్రణాళికతో ఈ దాడి జరిగిందని, రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.