మల్సాలో డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య: ఎస్ హెచ్ ఓ సస్పెన్షన్

రిపోర్టర్: వెంకట్ స్థలం: Mansa

పంజాబ్ రాష్ట్రంలోని మల్సాలో డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త పర్విందర్ సింగ్ ఝోటా హత్య కేసులో సిటీ-2 పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ బియాంత్ కౌర్ ను సస్పెండ్ చేసినట్లు ఎస్ ఎస్ పి వైభవ్ చౌదరి వెల్లడించారు. నిందితుడి భార్యపై కూడా కేసు నమోదు చేశామని, న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.