అరుదైన రికార్డు: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా అల్బేనియాకు చెందిన ఖమిలే మారా

రిపోర్టర్: సురేష్ స్థలం: అల్బేనియా

అల్బేనియా దేశానికి చెందిన వందేళ్ల వయసున్న ఖమిలే మారా ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా నిలిచారని ఆమె కుటుంబ సభ్యులు మరియు అధికారిక పత్రాలు వెల్లడించాయి. ఆగస్టు 19, 1909లో జన్మించిన ఆమె రెండు ప్రపంచ యుద్ధాలు, కమ్యూనిస్ట్ పాలనను చూశానని, జీవితం చాలా అందమైనదని ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్ తో తెలిపారు. ఐదు తరాల కుటుంబ సభ్యులతో ఆమె ఆనందంగా జీవిస్తున్నారని కుటుంబీకులు తెలిపారు.