కాంగ్రెస్ పాలనలోనూ కొనసాగుతున్న భూ దోపిడీ అంటూ కవిత ధ్వజం
రిపోర్టర్: రాజేష్
స్థలం: నిజామాబాద్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూదోపిడి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా అదే దోపిడీని కొనసాగిస్తోందని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని కొంగరకుర్దు గ్రామంలోని సర్వే నంబర్లు రెండు నుంచి నాలుగు వందల వరకు ఉన్న ఐదు వందల ఎనభై ఎకరాలపై భూ మాఫియా కన్ను పడిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అందులో ఇప్పటికే దాదాపు నూట యాభై ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.