రాజానగరం సీతానగరం జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఘన విజయం

రిపోర్టర్: హరి స్థలం: తూర్పుగోదావరి

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ పరిధిలోని సీతానగరం జడ్పీటీసీ స్థానానికి జరిగిన హోరాహోరీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరి బాబు విజయం సాధించారని ఎన్నికల అధికారులు తెలిపారు. జనసేన అభ్యర్థి బత్తుల వెంకటలక్ష్మిపై ఆయన 2,607 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఫలితంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తమవుతుండగా, స్థానిక రాజకీయ సమీకరణాలపై జోరుగా చర్చ సాగుతోంది.