ఇబ్రహీంపట్నంలో వినాయక లడ్డూ దక్కించుకున్న ముస్లిం యువకులు
రిపోర్టర్: గోపి
స్థలం: ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని బృందావన్ కాలనీలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో మత సామరస్యం వెల్లివిరిసిందని స్థానికులు తెలిపారు. గురువారం రాత్రి జరిగిన గణేశ్ లడ్డూ వేలంలో ముస్లిం సోదరులు ఉత్సాహంగా పాల్గొని లడ్డూలను దక్కించుకున్నారు. పెద్ద లడ్డూను మహ్మద్ హర్షద్, చిన్న లడ్డూను భాష కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు వరికుప్పల యాదగిరి, కౌన్సిలర్ కొండ్రు త్రిలోక్ తదితరులు వారిని ఘనంగా సన్మానించారు.