బొబ్బిలిలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం!

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని పాత హైవే సెంటర్లో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని వార్డులు, జెడ్పీటీసీ, ఎంపీటీసి, సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని, జాతీయ పార్టీగా ప్రాంతీయ పార్టీలకు దీటుగా నిలుస్తామని స్పష్టం చేశారు.